Department of Telugu

తెలుగు శాఖ రేఖా చిత్రణ

                  నవ నవోన్మేష విద్యా దీప్తులను వెదజల్లుతూ , కళ్యాణ దుర్గ  ప్రజల ఉన్నత విద్యా వ్యాప్తి కొరకు అహర్నిశలు పరిశ్రమిస్తున్న ఎస్.వి.జి.ఎం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రారంభం నాటి నుండే తెలుగు శాఖ ప్రారంభింపబడి నిత్య నూతన పాఠ్య ప్రణాళికలతో, నూతనోత్సాహంతో అలరారుతున్నది. ’ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ’ అన్న చందాన ఎందరో పూర్వ విద్యార్థులు ‘అపూర్వ విద్యార్థులు’గా  రాణింపబడి కళాశాల కీర్తి ప్రతిష్టలను యినుమడింప జేస్తున్నారు.  ఎందరో మేటి అధ్యాపకులు ఇక్కడ బోధకులుగా సత్కీర్తిని పొందారు.

        ప్రత్యేక తెలుగును అభ్యసించిన విద్యార్థులు పి .జి తెలుగు ప్రవేశాలలలో మంచి శ్రేణులను పొంది మేటి విశ్వ విద్యాలయాలలో ప్రవేశం పొందడం , కొందరు విద్యార్థులు పి.హెచ్.డి ప్రవేశాలను పొందడం ,మరి కొందరు విద్యార్థులు నెట్ , స్లెట్ వంటి అర్హతా పరీక్షలలో ఉత్తీర్ణతను పొందడం తెలుగు శాఖకు గర్వకారణం.

 

సందర్శించండి